మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.

0
1

మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్దతిప్ప సముద్రం మండలం రాపూరివారిపల్లికి చెందిన రైతులు పండించిన

మొక్కజొన్నను విజయవాడకు చెందిన దళారి పి. నవీద్ ఖాన్ రూ. 25. 61 లక్షలకు కొనుగోలు చేసి రూ. 11 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన రూ. 14. 61 లక్షలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని తెలిపారు. బకాయిలు ఇప్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.