మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.

0
3

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన సుమన్ స్కూటర్‌తో అభిలాష్‌ను ఢీకొట్టడంతో స్థానికులు అతనిపై దాడి చేశారు.

అనంతరం సుమన్ కత్తితో బాబు, సుధాకర్, సోమశేఖర్‌లపై దాడి చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. గ్రామస్తులు సుమన్‌ను పట్టుకుని కొట్టి గాయపరిచారు. పోలీసులు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.