పుంగనూరు: యువతకు క్రీడా వసతులు కల్పిస్తాం: చిన్న రాయల్

0
3

పుంగనూరు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ యువతుకు మెరుగైన క్రీడా వసతులు కల్పిస్తామని తెలిపారు. ‘జనవాణి’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలన్న యువత వినతి మేరకు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

దీనిలో భాగంగా, రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు. జనసేన పార్టీ ప్రతి వారం నిర్వహిస్తున్న ‘జనవాణి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.