అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలని సూచించారు.
ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర సహాయ నెంబర్ల గురించి మహిళలకు అవగాహన కల్పించారు# కొత్తూరు మురళి.










