సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.

0
3

సీఎంపై అభ్యంతరకర పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరికి కోర్టులో ఎదురుదెబ్బ

ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ప్రస్తుతం అరెస్టు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఈ దశలో ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గతంలో కుప్పం కోర్టు రిమాండ్‌ను తిరస్కరించగా, ఆ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసింది. నిందితుల తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ యాదవల్లి లక్ష్మణరావు, తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేశారు.