మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన దేవరాజ్ కుమార్ అనే నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
మద్యం, జూదం, బెట్టింగ్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన తనిఖీల్లో నక్కలదిన్నె వద్ద అతడు పట్టుబడ్డాడు. టొయోట ఇన్నోవా, మహేంద్ర TUV-300, టొయోట ఫార్చునర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.










