బుధవారం నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామం ఎగువపల్లిలో అలివేలమ్మ(45) అనే మహిళ విషసర్పం కాటుకు గురై మృతి చెందింది. ఇంటి ముందు పడుకుని ఉన్న సమయంలో పాము కాటేయడంతో ఆమె అస్వస్థతకు గురైంది.
కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.










