అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’ జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన వారిలో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొని నిందితులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబాల కోసం మారాలని కలెక్టర్ సూచించగా, మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిందితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంటుందని, అనంతరం మహిళలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.










