పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ రమ గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12న ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెలువడ్డాయి.
పాఠశాలలో మొత్తం 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. వీరిలో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విడుదలైన ఫలితాలను పాఠశాల నోటీస్ బోర్డులో ఉంచినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.










