గుండయ్య చెప్పినట్టు….‎డబ్బులు ఊరికే రావుకదా !!??

0
4

సామాన్య తండా వాసుల పేరిట జరుగుతున్న ఈ ‘కోట్ల రూపాయల’ మోసం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. వ్యవసాయం, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి దగ్గర కోట్లాది రూపాయల నగదు ఉండటం, వారు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోవడం ఆశ్చర్యకరం. పది రూపాయల వడ్డీ ఆశ చూపి మధ్యతరగతి వారిని, అమాయక గిరిజనులను ట్రాప్ చేయడం ఈ ముఠా వ్యూహం.

భూములు అమ్మి తెచ్చిన సొమ్ము అని చెబుతున్నా, ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు యంత్రాంగం కళ్లుగప్పి ఎలా జరిగాయో దర్యాప్తు చేయాలి. ఇది కేవలం ఒక అమ్మాయి మోసం మాత్రమే కాదు, నల్లధనం లేదా వ్యవస్థీకృత ఆర్థిక నేరమేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి