మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం మోండా డివిజన్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్”ను అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపరచడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందని, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు. కోటి మంది మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేసి కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
క్యాంటిన్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన మహిళా సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి సర్కిల్ డీసీ డాకూనాయక్, మెప్మా కోఆర్డినేటర్ యాదయ్య, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, శ్రీనాథ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju









