*దళారులను నమ్మి మోసపోవద్దు….*
– *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*
– *బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్*
భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున దుగ్గొండి మండలం బొబ్బర్పల్లె గ్రామపంచాయతీ రైతులు దళారులను నమ్మి మోసపోవకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్ సూచించారు. శుక్రవారం బోబ్బరోనిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి అధికారుల సూచనలు పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రంలో 2389 సన్న రకం, 2369 దొడ్డు రకం ధరతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్, ఏపీఎం రమేష్, ఏఈఓ రాజేష్, సిఏ కొనుకటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ కొనుకటి అరుణ, వార్డు సభ్యులు రాధారపు నరేష్, గోంగూర కోటి, లలిత, భాషబోయిన రాజు, మయూరి విఓ అధ్యక్షురాలు బొల్లం సావిత్రి, మాజీ సర్పంచ్లు ఎర్ర ఆది రెడ్డి, రైతులు కోడూరి రాజేందర్, కొలిపాక చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….










