బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా… హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను పరిరక్షించడం, తద్వారా మాత్రమే దేశంలో ఉగ్రవాదులను తరిమికొట్టడం సాధ్యమవుతుందని నొక్కి వక్కాణిస్తుంటారు కదా.
అదేవిధంగా చాలామంది ప్రజలు మోడీ గురించి, ఆ పార్టీ గురించి ఏది మాట్లాడినా సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అర్థం చేసుకుంటారు.. బూతుల అస్త్రాలు పట్టుకుని యుద్దానికి వస్తారు.
మరి.. అదే బీజేపీ కి చెందిన కేంద్ర మంత్రి కొడుకు అయ్యేసరికి… ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు ?










