మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.

0
6

మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు కోల్పోయిన రైతులందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామని తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్‌హెచ్ అధికారులు, బికేపల్లి, బసినికొండ, వెంకప్పకోట గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు త్వరితగతిన న్యాయబద్ధమైన నష్టపరిహారం అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.