అన్నమయ్య జిల్లా సీనియర్ మెన్ ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు.

0
1

అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె జెడ్పీ గ్రౌండ్‌లో మంగళవారం సీనియర్ మెన్ జిల్లా జట్టు ఎంపికలు జరిగాయి. ఈ ట్రయల్స్‌లో 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 30 మందిని ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌నకు ఎంపిక చేశారు. క్యాంప్ అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు తుది 20 మందితో జట్టును ప్రకటించనున్నారు. టీడీపీ యువ నాయకుడు జునైద్ అక్బరీ, జిల్లా క్రీడా అధికారి చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.