చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటియుసి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శులు వెంకటరమణారెడ్డి, రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులోని సివిల్ సప్లై గోడౌన్ లో డింగ్ అన్లోడింగ్ చేసే హమాలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రమిస్తున్న హమాలీలకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తెలియజేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని, వెంటనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.










