హైబ్రీడ్ మహానాడు విజయవంతం.. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
హైబ్రీడ్ విధానంలో నిర్వహించిన మహానాడును పూర్తి స్థాయిలో విజయవంతం చేసి, టీడీపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని కార్యకర్తలు నిరూపించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం జరిగిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహానాడులో రికార్డు స్థాయిలో 20 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు.
ఇక ఓటర్ల జాబితా సవరణ (సర్-SIR) ప్రక్రియపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే దీని ఉద్దేశమని, ఓట్లు తొలగిస్తారంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.










