నిజామాబాద్

0
4

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ ఎర్రం లింగం గారు, ఉప సర్పంచ్ రామ్ చందర్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర సాధనలో వారి కృషిని గుర్తుచేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకం మరియు తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని సంకల్పించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు గ్రామపంచాయతీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.