ఆసిఫాబాద్‌: లుంబిని దీక్షాభూమి కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలి

0
2

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్)

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం: జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షాభూమి ఆవరణలో నూతన కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కోరుతూ సెంటర్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మసాడే ప్రశాంత్, దుర్గం ప్రశాంత్ మరియు లుంబిని దీక్షాభూమి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దుర్గం తుకారాం, రాజ్‌కుమార్ నేతృత్వంలోని నాయకులు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తూ… ఆసిఫాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 50 వేల మంది మహార్ మరియు నేతకాని సామాజిక వర్గాల ప్రజలకు ఈ కమ్యూనిటీ భవనం ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు ఆత్మారాం, విలాస్, వామన్, లోహాజీ,… పురుషోత్తం, సంజు తదితరులు పాల్గొన్నారు.