చింతూరులో గూడ్స్ వాహనం సీజ్, నాలుగువేల రెండువందల ఫైన్!

0
4

చింతూరులో ఆదివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనానాన్ని సీజ్ చేసినట్లు చింతూరు ఎస్ ఐ ,సంతోష్ కుమార్ తెలిపారు. భద్రాచలం నుండి కోరుకొండకి 20మందితో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసి రూ,4200 ఫైన్ విధించి.

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి అప్పగించమని తెలిపారు. ఇటీవల కాలంలో మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు మీద అధికంగా గూడ్స్ వాహనాలు జనాలను అధిక సంఖ్యలో ఎక్కించుకుని బోల్తాపడిన సంఘటనలు అదికంగా జరుగుతున్న నేపధ్యంలో, వాహనాల తనికి అధికారులు ముమ్మరం చేశారు. ఇకపై గూడ్స్ వాహనాల్లో జనాలను తరలిస్తే వాహనాలను ఫైన్,వేసి సీజ్ చేస్తామని ప్రకటన ద్వారా హెచ్చరించారు.

 

# Yadagiri