స్మశాన వాటిక కబ్జాపై కలెక్టరేట్ ఎదుట నిరసన.

0
3

మదనపల్లె మండలం కొత్తపల్లి గ్రామంలోని సందిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న స్మశాన వాటికను చంగల్ రాయుడు, మరికొంతమంది ఆక్రమించుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

ఈ విషయంపై గ్రామస్థులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తరతరాలుగా తమ పూర్వీకుల దహన సంస్కారాలు నిర్వహిస్తున్న ఈ భూమిని కబ్జా చేయడం అన్యాయమని వారు వాపోయారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.