ఎమ్మిగనూరు నియోజకవర్గంలో SIR కార్యక్రమం నిర్వహించడం జరిగింది

0
2

యెమ్మిగనూరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు  ఎమ్మిగనూరు అసెంబ్లీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మతోట రామకృష్ణ గారు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ పరిధిలో బీఎల్‌ఏలను నియమించుకొని ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాల పరిశీలన చేపట్టాలని సూచించారు. ఓటరు జాబితాల్లో తప్పుగా నమోదైన వివరాలను సరిచేయడం, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడం, కొత్తగా అర్హత పొందిన ఓటర్ల పేర్లను నమోదు చేయించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.

అనంతరం జిల్లా అధికార ప్రతినిథి గురురాజ్ దేశాయ్ గారు మాట్లాడుచూ రాబొయే స్థానిక ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అన్నిమండలాలలోను

బిజెపి విజయకేతనం ఎగురవేయాలని కార్యకర్తలకు నాయకులకు సూచనలు చేశారు. ఒకొక్క బిజెపి కార్యకర్త వంద మందితో సమానమని మన జిల్ల అద్యక్షులు రామకృష్ణ గారి అండదండలతో ఎక్కడ కూడా తగ్గేదిలేదని, మన దేశంలో దేశం కోసం దర్మం కోసం పోరాడే ఎకైక జాతీయపార్టీ మన బారతీయ జనత పార్టి అని ఇలాంటి పార్టిలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలి అని చెప్పుకొచ్చారు.

ఇతర పార్టీలలాగ ఓటుకు డబ్బులిచ్చి ఓటర్లను కొనే సాంప్రదాయం బిజెపి పార్టి లో లేదని దమ్ము దైర్యం ఉన్న కార్యకర్తలు నాయకులు మాత్రమే ఈ పార్టిలో కొనసాగుతారని కొంతసేపు కార్యకర్తలను ఉత్తేజపరిచారు.

అనంతరం గురురాజ్ దేశాయ్ గారు జిల్ల అద్యక్షులు రామకృష్ణ గారికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ మురళి నాయుడు గారు, సినియర్ నాయకులు లలిత్ జైన్ గారు, జిల్ల సినియర్ నాయకులు బి. ఎల్. నారాయణ గారు, ఎమ్మిగనూరు టౌను అధ్యక్షులు దయాసాగర్ గారు, నందవరం మండల సినియర్ నాయకులు రామన్న గౌడు గారు, ఎమ్మిగనూరు సినియర్ నాయకులు టౌను ఉపాధ్యక్షులు గాజుల సురేంద్ర గారు, జిల్ల మహిలా మూర్ఛా ఉపాధ్యక్షులు పద్మావతి గారు, BJYM జిల్ల ఉపాద్యక్షులు లోకేశ్ గారు, BLA త్రిసభ్య కమిటి సబ్యులు బాస్కర్ శిల్పి గారు, ఎమ్మిగనూరు రురల్ మండలాద్యక్షులు బడేసాబ్ గారు, నందవరం మండలాద్యక్షులు రాజశేఖర్ స్వామి గారు, వివిద మోర్చ అద్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.