మదనపల్లి: రూ. 18, 013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం.

0
2

మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 18,013 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించారు.

ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 12,654 కోట్లు కేటాయించారు. గత ఏడాది లక్ష్యాన్ని మించి 120.11% ప్రగతితో రూ. 19,962 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి, లబ్ధిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు.