మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధి-2కు చెందిన డి. శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ తమ తాత స్వాతంత్ర్య సమరయోధుడు డి. మునిస్వామికి చెందిన వంశపారంపర్య స్థలాన్ని స్వర్ణలత అనే మహిళ ఆక్రమించిందని ఆరోపించారు.
వంశపారంపర్య స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితుల ఆవేదన.
బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తమ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.










