ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితో పాటు 24 ఫార్మసిస్ట్, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు కలిపి మొత్తం 529 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి. ఎంపికైన వారిని యూపీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులలో నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 13 నుండి జూన్ 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు కోరారు.










