రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉదయాన్నే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజాదర్బార్ నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రిగారికి వివరించగా వాటిని
ఓపికగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రతి సమస్యపై స్పందిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి స్థానిక ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతుంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాయచోటి అధ్యక్షులు గండికోట సుధాకర్ మరియు అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు










