ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్

0
0

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు, వ్యాపారులపై వేధింపులు, అవినీతి పెరిగాయని ఆరోపించారు. వైయస్ జగన్ హయాంలో అందరికీ సమాన న్యాయం, భద్రత లభించాయని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులంతా ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు కమిటీలలో ఆర్యవైశ్యులను మరియు మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. బాధితుల సమస్యల నమోదుకు డిజిటల్ బుక్ ఏర్పాటు చేశామన్నారు. వైయస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి, రాజకీయ ఎదుగుదలకు అండగా ఉంటుందని సజ్జల భరోసా ఇచ్చారు.