మదనపల్లెలో మామపై అల్లుడు దాడి|

0
0

మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బొమ్మన్‌చెరువుకు చెందిన రెడ్డప్ప (56)ను మాలెపాడు దేవలంపల్లికి చెందిన నరసింహులు ఇంటికి పిలిచి, అల్లుడు బాలాజీకి సంబంధించిన విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నరసింహులు కర్రతో దాడి చేయడంతో రెడ్డప్ప గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.