మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని విరిచినట్లు గుర్తించారు. గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు నరసింహాచారి ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్, కార్యదర్శి మురళీకృష్ణ ఘటనను పరిశీలించి స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.










