మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఖరారు కావడంతో, నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ గురువారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్‌లను కలిసి వినతి పత్రం అందజేశారు. జగన్ పర్యటనకు అవసరమైన అనుమతులు, హెలిప్యాడ్ ఏర్పాటు, పోలీసు భద్రతా చర్యలపై చర్చించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమీక్షిస్తున్నారు.










