పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత – గూడూరి ఎరిక్షన్ బాబు|

0
0

పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత – గూడూరి ఎరిక్షన్ బాబు

పెద్దారవీడు మండలం, మల్లవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో ఆదివారం కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు.

ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.