ఎస్‌ఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్ స్నేహ శబరీష్|

0
0

మహబూబాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ప్రతి అర్హ ఓటరు ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే 78 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, మరో రెండు రోజుల్లో 100 శాతం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించి ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.

ఓటర్లు తమ వివరాలను voters.eci.gov.in వెబ్‌సైట్ లేదా ECINET యాప్ ద్వారా పరిశీలించవచ్చని, సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు.