ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన
ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ నేతల అరెస్ట్
MAHABUBABAD:భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ట్రాక్టర్‌పై గుడిసె ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించాలని, గుడిసెవాసులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బి. విజయసారథితో పాటు సుమారు 40 మంది సీపీఐ నాయకులను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









