“దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్న ఎంపీ ఈటల రాజేందర్”
హైదరాబాద్, జూలై 6: నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ సమైక్యత, జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహనీయుల ఆశయాలకు అనుగుణంగా భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాల పునరుద్ధరణతో దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోందని ఈటల రాజేందర్ అన్నారు.
#Sidhumaroju






