Home South Zone Telangana బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|

బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|

0
5

“బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి”

మేడ్చల్ మల్కాజ్‌గిరి,,: జూలై 6: భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు.

బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, తులసి సురేష్, సాయిసాగర్, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, గౌస్ ఇమ్రాన్, సాయి గౌడ్, రాజు, సురేష్ జమీందార్, ముత్యాలు, బంటి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

#Sidhumaroju

Alwal

NO COMMENTS