భోగాపురం ఎయిర్పోర్ట్కు APSRTC నడపనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 బస్సులు బుధవారం విశాఖ స్టీల్ డిపోకు చేరాయి. త్వరలో 20 బస్సులు రానున్నాయని రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు.ప్రారంభోత్సవం అనంతరం గాజువాక నుంచి రెండు మార్గాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ బస్సులు నడుపుతారు. NAD, గురుద్వారా, వెంకోజిపాలెం, వుడా పార్క్ వద్ద లాంజ్లు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్, అక్టోబర్లో మరో 80 బస్సులు రానున్నాయి.
#Boiena Rajesh










