పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు వెళ్తున్న గిరిజనులను చింతూరు పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో జీఓ నెంబర్ 3 కి సమానమైన చట్టం తెస్తాము అని గిరిజనులకు హామీ ఇచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో. పోలవరం జిల్లాలో సీఎం పర్యటన ఈనెల ఉండగా గిరిజన జీఓ లను కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ శాంతియుత ధర్నాకు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా ఈరోజు చింతూరు, వి ఆర్ పురం, కూనవరం, ఎటపాక నుండి నాలుగు మండలాల గిరిజనులు భారీగా రంపచోడవరం బహిరంగ సభకు వాహనాలతో వెళ్తున్న సమయంలో గిరిజనులను పోలీసువారు అడ్డగించడంతో ఆగ్రహించిన గిరిజనులు చింతూరు ఐటిడిఏ ముందు ధర్నా చేస్తూ మేము మాహక్కుల కోసం శాంతియుతంగా రంపచోడవరం వెళ్తుంటే పోలీసుల అడ్డగించడం దారుణం అని ధర్నాలో తెలిపారు.
# Yadagiri










