● విద్యార్థులే పర్యావరణ పరిరక్షణకు రాయబారులు కావాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు
● సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో ఎన్విరాన్‌మెంట్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో నిర్వహించిన ఎన్విరాన్‌మెంట్ డే సెలబ్రేషన్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను చదువుకున్న పాఠశాలలోనే నేడు ముఖ్య అతిథిగా పాల్గొనడం గర్వకారణంతో పాటు భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు.
విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించిన ఆయన, ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
భావితరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పర్యావరణ అవగాహన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆసక్తిగా వీక్షించారు.
సమాజంలో పర్యావరణ చైతన్యం పెంపొందించడంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ ఇన్నయ్య, లియోనార్డ్ మీఘర్, అరుణ్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










