సముద్రంలో బోల్తా పడిన బోటు.. 7 మంది మత్స్యకారుల రక్షణ |

0
1

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేట ముగించుకుని తిరిగి వస్తుండగా, వారి బోటు ఇసుక దిబ్బను ఢీకొని బోల్తా పడింది. దీంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు.

వారి ఆర్తనాదాలు విన్న చిన్నలంక గ్రామస్తులు వెంటనే స్పందించి సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టారు. ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు బాధితులను పునరావాస కేంద్రానికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.