పూర్ణపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏనుగులు కనిపిస్తే వాటిని తరిమే ప్రయత్నం చేయకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.










