మదనపల్లెలో అర్హులందరికీ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా |

0
2

Madanapalle: ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా కృషి చేస్తున్నట్లు 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిపి) మధుసూదన్ రెడ్డి తెలిపారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

 

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అందించడమే లక్ష్యమని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.