వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సౌండ్ సిస్టమ్ యజమానులతో సమావేశం నిర్వహించారు.
డీజే సౌండ్ బాక్సులతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.










