ఇటీవల స్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. హిందూ స్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్ గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు.హిందూ స్మశాన వాటికలో ఎట్టి పరిస్థితులలో డంపింగ్ యార్డ్ తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ కు రంగనాథ్ సూచించారు. డంపింగ్ యార్డ్ కోసం కేవలం రెండెకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని దాదాపు 5 ఎకరాల లో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు.
గత 24 రోజులుగా హిందూ స్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డ్ మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు వెంటనే డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని అన్నారు.