అల్వాల్ :ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొత్త చర్చకు తెరలేపొందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలిపారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ పరిధి ఆర్టీసీ కాలనీలోని జయలక్ష్మి గార్డెన్ లో బీజేవైఎం జాతీయ కోశాధికారి టీం సాయి నేతృత్వంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై బిజెపి నాయకుల తో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి భాజపా జాతీయ ప్రధాన కార్యద ర్శి సునీల్ బన్సల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర భాజపా నాయకులు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు.