అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా జెబిఎస్ బస్డాండ్ సమీపంలో కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ నిర్వహించింది కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉన్నారు.
వెట్టి చాకిరి నుంచి విముక్తి కార్మికులు చేసిన పోరాటానికి గుర్తుగా కార్మికుల దినోత్సవం జరుపుకుంటామని, కార్మికుల తమ హక్కులు, సమస్యల గురించి చర్చించుకునే వారు. రోజుగా ఈ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటామని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.వందేళ్ల క్రితం కార్మికులు చేసిన పోరాటం ఎంతో మంది కార్మికుల త్యాగాల ఫలితంగా ఈనాడు కార్మికులకు రోజుకు 8 గంటల పని సమయం, ప్రతి ప్రాంతంలో సరైన వసతులు, కనీస వేతనం లాంటి అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.దేశ అభివృద్దిలో కార్మికులదే కీలకపాత్ర అని, వారి శ్రమతోనే అభివృద్దికి బాటలు పడతాయని ..అయితే దేశంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని కొంత మంది బడా పారిశ్రామికవేత్తల కోసం కార్మిక చట్టాలను మార్చి మళ్లీ కార్మికులు రోజుకు 12 గంటల పని చేయడం, పని ప్రదేశాలలో కనీస వసతుల కల్పన లాంటి విషయాలకు తూట్లు పొడుస్తుందని కార్మిక నాయకులు, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని. అందుకే సంఘటిత, అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించింది. వారి కోసం ప్రత్యే క చట్టాన్ని కూడా రూపొందించాలని అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖలలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు.