సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే

0
17

కంటోన్మెంట్ వార్డు 4 గాంధీ కాలనీ నుంచి ఎల్ఐసి కాలనీ వరకూ నిర్మిస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రేనేజీ పనులకు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు వేగంగా పూర్తి చేసి త్వరగా కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 4 గాంధీ కాలనీ నుంచి ఎల్ఐసి కాలనీ వరకూ నిర్మిస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రేనేజీ పనులను కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా పూర్తి చేసి త్వరగా కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మల్యే అధికారులను ఆదేశించడం జరిగింది.

కంటోన్మెంట్ లోని ప్రతి వార్డులోని సమస్యలను ఒక్కక్కటిగా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంటోన్మెంట్ ను సమస్యలే లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్.

ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ సురేఖ, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, వార్డ్ ఇంఛార్జ్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు బద్రీనాద్ యాదవ్, అశోక్, ధనశ్రీ, తదితరులు పాల్గొన్నారు.