మచ్చ బొల్లారం డివిజన్: రైల్వే ఉన్నత అధికారులు జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో మల్కాజ్‌గిరి నియోజకవర్గం లోని రైల్వే సమస్యల పరిష్కారానికి కృషిచేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.మచ్చ బొల్లారం డివిజన్ జనప్రియ వద్దగల అదనపు ఆర్ యు బి నిర్మాణం కొరకు పరిశీలించి మంజూరైన పనులు జూలై లో పనులు ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.అదేవిధంగా బొల్లారం రైల్వే బజార్ వద్ద గల కొత్త బస్తీ సమీపంలోని రైల్వే టన్నెల్ నీరు వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో లోతట్టు ప్రదేశంలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానిక పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే టెనల్ మార్గాన్ని వెడల్పు చేస్తున్నారు అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏడిఆర్ఎం రెహమాన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిరుద్ పవర్, శశాంక్ నామ్‌దేవ్, అరుణ్ శర్మ, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ లు సురేష్ ,పవన్, నాగలింగబాబు,
బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్ అనిల్ కిషోర్, లక్ష్మణ్ యాదవ్ శోభన్, పవన్, శరణగిరి, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సురేష్, రైల్వే అధికారులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక కాలనీవాసులు ఉన్నారు.