భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.

0
13

17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక వ్యక్తికి గంజాయిని ఇవ్వడానికి బీహార్‌కు చెందిన ఏ. రమేష్‌ కుమార్‌, ఏ చందన్‌ కుమార్‌ ఇద్దరు కలిసి మూడు బాగుల్లో 17 గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్‌ రైళ్లో వచ్చి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో గంజాయి ప్యాకెట్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ డీటీఎప్‌ సీఐ సావిత్రి సౌజన్యతో పాటు సిబ్బంది కలిసి, నిందితులను…గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి తీసుక వచ్చిన ఈ గంజాయిని డిటిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని సికింద్రాబాద్‌ ఏఈఎస్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ గంజాయిని ఎవరికి  ఇవ్వడానికి తీసుక వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నిందితులను.. గంజాయిని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అప్పగించారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో సీఐతోపాటు సత్యనారాయణ, ఖలీల్‌, రవి,శిల్పా, పరమేష్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం తో పాటు హైదరాబాద్‌ ఇంచార్జీ డీసీ. అనిల్‌కుమార్‌రెడ్డిలు అభినందించారు.