ఆత్మకూరు టౌన్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ. బీసన్న లు అన్నారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం రూ. 21వేలు, రూ. 24,500 లు ఇవాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ స్థానంను మరణించిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు తిరిగి పనులు కల్పించాలన్నారు. స్కూల్ స్వీపర్సు, వాచ్మెన్ లకు కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలన్నారు. కార్మికుల అర్హతను బట్టి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఆత్మకూరు పట్టణంలో పనిచేయుచున్న కార్మికుల పెండింగ్ పిఎఫ్ వారి అకౌంట్లో జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఎం. నాగరాజు, పి. దొరస్వామి, రుతమ్మ, రాజీవ్,
శంకర్రావు, దానమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.