గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం,
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్
వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.
ఈ వైద్య శిబిరం కార్యక్రమం తహశీల్దార్ వెంకటేష్ నాయక్
డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ,
ఆర్.ఎస్. డిప్యూటీ తహశీల్దార్ లోకేష్
మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్ నాయక్
వారి సమన్వయంతో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలు), విలేజ్ రెవెన్యూ అధికారులు ( వీఆర్వో లు) తో పాటు.వి ఎస్ ఇతర రెవెన్యూ సిబ్బంది సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.